- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sangareddy: లోన్ యాప్ వేదింపులకు మరో యువకుడు బలి
ఆన్ లైన్ లోన్ యాప్(Online Loan Apps) వేదింపులు తాళలేక మరో యువకుడు బలైన ఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: ఆన్ లైన్ లోన్ యాప్(Online Loan Apps) వేదింపులు తాళలేక మరో యువకుడు బలైన ఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy District)లో జరిగింది. సదాశివపేట(Sadashiva Peta) పట్టణానికి చెందిన ల్యాకజి ప్రశాంత్ అనే యువకుడు లోన్ యాప్స్ లో కోటి అరవై లక్షలు అప్పు చేశాడు. అధిక వడ్డీ వేసి అప్పు తీర్చాలని ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు యువకుడిని వేధింపులకు గురి చేయడంతో చాలా వరకు అప్పు తీర్చాడు. ఎంత డబ్బు కట్టినా అప్పు తీరకపోవడంతో యువకుడు తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. యాప్ నిర్వహకులు వేధింపులు తీవ్రతరం కావడంతో.. అప్పులు తీర్చలేక మనస్తాపంతో సింగూర్ డ్యామ్(Singur Dam) లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్యామ్ లో మృతదేహం తేలుతుండటం గమణించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికితీసి, సదాశివపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






