- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sangareddy: అమౌంట్ పడుతోంది.. పెట్రోల్ మాత్రం రాదు.. పెట్రోల్ పంపులో వెరైటీ మోసం
సాధారణంగా పెట్రోల్ బంకు(Petrol Bunk)లో వాహనాలకు ఇందనం కొట్టించుకోవాలంటే మీటర్ లో ఎంత కొట్టించాలి అనేది సెట్ చేసిన తర్వాతే మనకు పెట్రోల్(Petrol), డీజీల్(Diesel) ఇస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పెట్రోల్ బంకు(Petrol Bunk)లో వాహనాలకు ఇందనం కొట్టించుకోవాలంటే మీటర్ లో ఎంత కొట్టించాలి అనేది సెట్ చేసిన తర్వాతే మనకు పెట్రోల్(Petrol), డీజీల్(Diesel) ఇస్తుంది. కానీ సంగారెడ్డి జిల్లా(Sangareddy Disrtict)లోని ఓ పెట్రోల్ బంకులో ఇవేమి లేకుండానే డైరెక్ట్ గా మీటర్ దానికదే తిరుగుతోంది. అయితే ఇందులో వింత ఏమిటంటే మీటరు తిరుగుతోంది.. అమౌంట్ చూపిస్తుంది కానీ ఇందనం మాత్రం బయటికి రావట్లేదు. పెట్రోల్ పంపులలో చాలా మోసాలు జరుగుతుంటాయి.
కల్తీ పెట్రోల్ అమ్మడం, మీటర్ లో లోపాలు చూపించి తక్కువ ఇందనం పట్టడం లాంటి మోసాలను చూశాం కానీ సదాశివపేట మండలం ఆత్మకూరు శివారు పెట్రోల్ పంపులో వెరైటీ మోసం వెలుగుచూసింది. పెట్రోల్, డీజిల్ రాకున్నా మీటర్ మాత్రం తిరుగుతోంది.. అమౌంట్ చూపిస్తుంది. శుక్రవారం ఈ ఘరానా మోసాన్ని స్థానిక ప్రజలు గుర్తించారు. దీనిపై పెట్రోల్ పంపు నిర్వాహకులను నిలదీయగా.. వారు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇన్ని రోజుల నుంచి మోసపోతున్నామని తెలుసుకున్న వినియోగదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంకు నిర్వాహకులపై చర్యలు తీసుకొని తమకు చేయాలని వినియోగదారులు నిరసన వ్యక్తం చేశారు.






