Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మరోసారి పోలీసులకు NHRC నోటీసులు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre Stampede) ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కు మరోసారి నోటీసులు జారీ చేసింది.

Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మరోసారి పోలీసులకు NHRC నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre Stampede) ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై 6 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ పోలీసులు గతంలో ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్A(llu Arjun) నటించిన "పుష్ప 2: ది రూల్"(Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి, రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనపై అడ్వకేట్ రామారావు ఇమ్మనేని ఫిర్యాదు చేయడంతో NHRC చర్యలు తీసుకుంది. చిక్కడపల్లి పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని, దీనివల్ల రేవతి మరణించి, ఆమె కుమారుడు గాయపడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story