G. Chinnareddy : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇంజనీరింగ్, లా కాలేజీల మంజూరు

by Y. Venkata Narasimha Reddy |

ఉమ్మడి మహబూబ్ నగర్(joint Mahbubnagar) జిల్లాకు ఇంజనీరింగ్, లా కాలేజీల(engineering and law college)లు మంజూరు అయినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి(G. Chinnareddy) వెల్లడించారు.

G. Chinnareddy : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఇంజనీరింగ్, లా కాలేజీల మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి మహబూబ్ నగర్(joint Mahbubnagar) జిల్లాకు ఇంజనీరింగ్, లా కాలేజీల(engineering and law college)లు మంజూరు అయినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి(G. Chinnareddy) వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విద్యాభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుందని చిన్నారెడ్డి అన్నారు. విద్యా రంగంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చాలా వెనుకబడిందని, విద్యా రంగంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంకా పురోగతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరులకు చిన్నారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

విద్యపరంగా వెనుకబడిన పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్ నియోజకవర్గంలో ఇటీవల పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజీలకు శంకుస్థాపన చేయగా, తాజాగా పాలమూరులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఏర్పాటు చేసేందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పాలమూరు వర్సిటీ పరిధిలో త్వరలో లా, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు కానుండటం విశేషం.

Next Story