- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tims Hospital: సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం అప్పుడే.. కీలక అప్ డేట్ ఇచ్చిన మంత్రి దామోదర
సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఇవాళ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వచ్చే ఉగాది నాటికి సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇవాళ సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని ఎలక్ట్రికల్ వర్క్స్ కొన్ని ఇంకా చేయాల్సి ఉందన్నారు. ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్, ఇతర ఎక్విప్‌మెంట్ ఏర్పాట్లు కూడా చివరి దశలో ఉందని ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాల ఫిట్టింగ్ పూర్తయిందని తెలిపారు. అన్ని రకాలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో ఉగాది నాటికి పేషెంట్లకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తామన్నారు.
ప్రచార ఆర్భాటం కాదు ప్రజల కోసం ఆరాటం:
మాది ప్రచార ఆర్భాటం కాదని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే మా ఆరాటం అన్నారు. వెయ్యి బెడ్ల ఈ హాస్పిటల్‌లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా సనత్‌నగర్ టిమ్స్ ఉండబోతోందని ఇక్కడే అవసరమైన రీసెర్చ్ జరుగుతుందన్నారు. ఇక్కడ అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నిరకాల అవయవ మార్పిడి సర్జరీలు చేసేలా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో తెస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశాఖలో గత రెండేళ్లలోనే సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పిన మంత్రి.. ఇంకో 7 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ అవుతున్నాయని త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ నియామకాలతో రాష్ట్రంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఎలాంటి కొరత ఉండదని అన్నారు.






