సమ్మక్క-సారలమ్మ హూండీ లెక్కింపు.. తొలిరోజు రూ.2.49 కోట్ల ఆదాయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 02:18:36  IST  )

మేడారం సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) జాతరలో భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది.

సమ్మక్క-సారలమ్మ హూండీ లెక్కింపు.. తొలిరోజు రూ.2.49 కోట్ల ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) జాతరలో భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రక్రియ ఘనంగా ప్రారంభమైంది. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను చేపట్టారు. లెక్కింపులో భాగంగా మొదటి రోజు మొత్తం 125 హుండీలను తెరిచారు. వీటి ద్వారా రూ.2,49,65,000 నగదు ఆదాయం లభించినట్లుగా అధికారులు వెల్లడించారు.

అయితే, భక్తులు తమ మొక్కుల రూపంలో భారీగా నగదును సమర్పించుకోవడంతో ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ లెక్కింపు ప్రక్రియ అంతా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, సేవా సమితి సభ్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా సాగుతోంది. నగదుతో పాటు భక్తులు సమర్పించిన బంగారం, వెండి కానుకలను అధికారులు వేరు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, లెక్కింపు పూర్తయిన బంగారం, వెండి వస్తువులను ప్రత్యేక ఇనుప హుండీలలో భద్రపరిచి, వాటికి తాళాలు వేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. రానున్న రోజుల్లో మిగిలిన హుండీల లెక్కింపును కూడా ఇదే విధంగా కొనసాగించనున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

Next Story