సోనియాకు సెల్యూట్.. : కవిత

by Disha Web Desk 4 |
సోనియాకు సెల్యూట్.. : కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాం, ఈడీ నోటీసుల అంశంపై నేడు కవిత ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత సోనియాగాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చారని ఆమె ధైర్యానికి సెల్యూట్ అన్నారు. అయితే లిక్కర్ స్కాం అంశంలో ప్రతిపక్షాల మద్దతు కూడగడుతున్న బీఆర్ఎస్ తాజాగా సోనియా గాంధీని కూడా తమకు బాసటగా నిలవాలని ఇన్‌డైరెక్ట్‌గా సపోర్ట్ కోరడంలో భాగంగానే కవిత ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ నడుస్తోంది.మరి ఈ అంశంపై సోనియా గాంధీ ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు లిక్కర్ స్కాం విషయంలో కవితపై చర్యల్లో బీజేపీ తాత్సరం చేస్తోందని మండిపడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంలో సైలెంట్ గా ఉండటం సంచలనంగా మారింది.

మరోవైపు కవిత తన నిస్సాహయతను చెప్పకనే చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో తనకు అన్ని దారులు మూసుకుపోయ్యాయన్న ఆవేదన కవిత మాటల్లో కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఉదాహారణగా ఢిల్లీలో ఆమె వ్యాఖ్యలను చూపుతున్నారు. లిక్కర్ కేసులో తాను విచారణకు హాజరు అవుతా అని చెబుతూనే మాకు దేవుడే దిక్కు అని కవిత పేర్కొనడం ఆమె నిస్సాహయతకు అద్దం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు.

Read more:

కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్.


Next Story