- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు నెలలుగా అందని జీతాలు.. ఉస్మానియా ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ల ధర్నా
by Kema Shiva Kumar |
నగరంలోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ల మెరుపు ధర్నా చేపట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటైన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి (Osmania General Hospital)లో టెక్నీషియన్లు ఆందోళన బాట పట్టారు. గత 3 నెలలుగా తమకు రావాల్సిన జీతాలు పెండింగ్‌లో ఉన్నాయంటూ విధులను బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు, ప్రతి నెలా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే పెండింగ్ జీతాలను విడుదల చేయాలని ల్యాబ్ టెక్నీషియన్లు (Lab Technicians) డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ విడుదల కాలేదని అధికారులు చెబుతున్నారని, కానీ తమ కుటుంబాలు గడవడం కష్టమవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, టెక్నీషియన్లు మెరుపు ధర్నాకు దిగడంతో ల్యాబ్ పరీక్షలు, ఇతర వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Next Story






