- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gurukula: గురుకులాల గెస్ట్ ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి: ఐఎస్‌యు జాతీయ అధ్యక్షులు
రాష్టంలోని అన్ని రకాల గురుకులాలలో పనిచేస్తున్న గెస్టు ప్యాకల్టీలకు వేతనాలను పెంచాలని ఐఎస్‌యు జాతీయ అధ్యక్షులు పాపని నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్టంలోని అన్ని రకాల గురుకులాలలో పనిచేస్తున్న గెస్టు ప్యాకల్టీలకు వేతనాలను పెంచాలని ఐఎస్‌యు జాతీయ అధ్యక్షులు పాపని నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకేసారీ జీతాలను పెంచిందని తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, దవాఖానల ఖర్చులు, పిల్లల ఫీజులు, తదితర అన్ని రకాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఈ కాలంలో అన్ని రకాల ఉద్యోగస్తులకు పెరుగుతున్న వేతానాలను దృష్టిలో పెట్టుకొని, గంటల ప్రాతిపదికన పాఠాలు భోదించాలని నిభంధనలు ఉన్నా వీరిని మాత్రం అన్ని రకాల అప్రకటిత రంగాల్లో శ్రమను దోచుకుంటున్నారన్నారు. శ్రమ వెట్టిచాకిరి క్రిందకు లెక్కకట్టరాదని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ అంటే మట్టి కాదు, బహుళ బహుజన ప్రజలు. ప్రజల సామాజిక, ఆర్థిక రంగాల అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుదని చెప్పుకునే ఈ ప్రభుత్వం , గెస్ట్ ప్యాకల్టీల దయానియ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని పేర్కొన్నారు.






