విశాఖ యాక్సిడెంట్‌పై సజ్జనార్ ట్వీట్.. తల్లిదండ్రులకు కీలక సూచన (వీడియో)

by Disha Web Desk 4 |
విశాఖ యాక్సిడెంట్‌పై సజ్జనార్ ట్వీట్.. తల్లిదండ్రులకు కీలక సూచన (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తల్లిదండ్రులారా...! పిల్లల సురక్షిత రవాణాపై ఆలోచన చేయండని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. ప్రైవేటు వాహనాల్లో స్కూళ్లకు పంపి.. చిన్నతనంలోనే వారిని ప్రమాదాల పాలు చేయొద్దని పేర్కొన్నారు. ఏపీ విశాఖపట్నంలోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద ఇవాళ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో.. లారీని ఢీకొట్టిన ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

విశాఖపట్నంలో స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాద దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి. ఎవరో చేసిన తప్పుకు అభం శుభం తెలియని చిన్నారులు గాయాల పాలై వారు క్షోభను అనుభవించడం చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అజాగ్రత్త, అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని సీసీ ఫుటేజీని చూస్తే తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.


Next Story