- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నడిరోడ్ల మీద ఇదేం అతి.. ఆకతాయిలకు బుద్ధి చెప్పిన సీఐ: వీసీ సజ్జనార్ ట్వీట్
హైదరాబాద్ పరిధిలో ఈ మధ్య యువత రోడ్లపై జన్మదిన వేడుకులు జరుపుతున్నారు. ఫుల్లుగా మద్యం సేవించి.. రోడ్లపై విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పరిధిలో ఈ మధ్య యువత రోడ్లపై జన్మదిన వేడుకులు (birthday celebrations) జరుపుతున్నారు. ఫుల్లుగా మద్యం సేవించి.. రోడ్లపై విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉండే వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. అర్థరాత్రి సమయంలో రోడ్లపై జరుగుతున్న బర్త్ డే సెలబ్రేషన్స్ వల్ల శాంతిభద్రతలకు భంగం కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అర్ధరాత్రి రోడ్లపై జన్మదిన వేడుకలు జరుపుతున్న యువకులకు ఉప్పల్ పోలీసులు బుద్ధి చెప్పారు. ఉప్పల్‌లోని భగాయత్ రోడ్లపై ఆకతాయిలు బర్త్ డే వేడుకలు జరుపుతున్న సమయంలో సీఐ ఎలక్షన్ రెడ్డితో పాటు సిబ్బందికి అడ్డంగా బుక్ అయ్యారు. అర్ధరాత్రి రోడ్లపై ఇలా చేయడం కరెక్ట్ కాదని బుద్ధి చెప్పారు. ఇంకోసారి ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సీఐ వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (Sajjanar) తన ఎక్స్ ఖాతా వేదికగా సోమవారం వీడియో పోస్ట్ చేశారు. నడిరోడ్ల మీద ఇదేం అతి.. అంటూ మండిపడ్డారు. దోస్తులను పిలవాలి.. నడిరోడ్డు మీదకు రావాలి.. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో నానా హంగామా చేయాలి.. రోడ్ల మీద వెళ్లే వారికి ఇబ్బందులు కలిగిన, అసౌకర్యానికి గురైన వారికేం పట్టదు.. అని పేర్కొన్నారు. నడిరోడ్డుపై ఇలా బర్త్ డే వేడుకలు యువతకు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం వేడుకల పేరుతో వెర్రి వేషాలు వేస్తున్నారని, పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి మీ ఇంట్లో జరుపుకోవాలని, నడి రోడ్ల మీద కాదని సూచించారు. బర్త్ డే కదా అని వదిలేయకుండా మీ పిల్లలు కదలికలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇతరులను ఇబ్బందికి గురి చేస్తూ.. వేడుకలు చేసుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. కాగా, అర్ధరాత్రి రోడ్లపై బర్త్ డే వేడుకలు చేసుకుంటామంటే కేసులు తప్పవు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ్ముల్లు జర భద్రం.. పుట్టినరోజున రోడ్లపై తిరగకుండా ఇంట్లోనే మంచిగా సెలబ్రేట్ చేసుకోండని ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






