సాటి మనిషికి సాయం చేయలేని సమాజంలో ఉన్నామా? నిందితుడి చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్యపై సజ్జనార్ స్పందన

by Ramesh Naini |

కేసు ద‌ర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిలో నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్ర‌మోద్ దారుణ హ‌త్య ఘ‌ట‌న తీవ్రంగా క‌లిచివేసిందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తెలిపారు.

సాటి మనిషికి సాయం చేయలేని సమాజంలో ఉన్నామా? నిందితుడి చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్యపై సజ్జనార్ స్పందన
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసు ద‌ర్యాప్తులో భాగంగా నిందితుడి చేతిలో నిజామాబాద్ (CCS Constable) సీసీఎస్ కానిస్టేబుల్ ప్ర‌మోద్ దారుణ హ‌త్య ఘ‌ట‌న తీవ్రంగా క‌లిచివేసిందని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈ సంఘ‌ట‌న అత్యంత దుర‌దృష్ట‌క‌రమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కండ్ల‌ముందే ఘోరం జ‌రుగుతున్న త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా కొంద‌రు వ్య‌వ‌హారించారని, కానిస్టేబుల్‌కు తీవ్ర ర‌క్త‌స్రావం అవుతున్న.. ఫోటోలు, వీడియోలు తీసుకున్నారని మండిపడ్డారు. తోటి మ‌నిషి ఆప‌ద‌లో ఉంటే క‌నీసం స్పందించ‌క‌పోవ‌డం బాధ‌క‌రమని, స‌మాజం ఎటో పోతుందో అర్థంకానీ ప‌రిస్థితి అని తెలిపారు. విధి నిర్వ‌హ‌ణ‌లో దారుణ హ‌త్య‌కు గురైన ప్ర‌మోద్ కుటుంబానికి అన్ని విధాల అండ‌గా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ ఘటనపై శనివారం ఎక్స్ వేదికగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) స్పందించారు. ‘ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయలేని సమాజంలో మనం ఉన్నామా!? అని తలుచుకుంటేనే బాధేస్తోంది. పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు రోడ్డుపై కత్తితో పొడుస్తుంటే అక్కడ ఉన్నవాళ్లు అడ్డుకోపోగా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం దురదృష్టకరం. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్‌కు నివాళి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Next Story