Sajjanar: నాగరిక సమాజంలో ఉన్నామా? లేక రాతి యుగంలో ఉన్నామా?.. సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్

by Prasad Jukanti |   (  Updated:2026-01-17 13:15:41  IST  )

పెరుగుతున్న సాంకేతికతతో పాటు మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోందనే సంఘటనలు జరుగుతున్నాయి.

Sajjanar: నాగరిక సమాజంలో ఉన్నామా? లేక రాతి యుగంలో ఉన్నామా?.. సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‍గా ఉండే హైదరాబాద్ సిటీ సీపీ వి.సి సజ్జనార్ (V.C Sajjanar) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత పెరిగి మనిషిలో స్పందన కరువవడం బాధాకరం అన్నారు. ఇటీవల భార్య నిప్పంటించుకుంటే దగ్గరుండి భర్త వీడియో తీసిన ఘటన, బాలుడిని చేపల ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో పిల్లవాడిని చూడకుండా ప్రజలు చేపలను ఎత్తుకెళ్లిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ సజ్జనార్ స్పందించారు. ఈ రెండు ఘటనలు చదువుతుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా? లేక రాతి యుగంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్లలో బంధించే దృశ్యాల కన్నా, స్వలాభం కన్నా.. తోటి మనిషి పట్ల చూపే జాలి మిన్న అని పోస్టు చేశారు.

Read More... లక్కీ డ్రా స్కీమ్.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Next Story