లక్కీ డ్రా స్కీమ్.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-17 13:13:52  IST  )

లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.

లక్కీ డ్రా స్కీమ్.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సిటీ క్రైమ్: లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని లక్కీ డ్రా పేరుతో కొంత మంది ఇన్ఫ్లూయోన్సర్లు అమాయకులను ఆకట్టుకుని నిండా ముంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇలాంటి మోసాలపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ -1978 కింద కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు. ఈ వ్యవహారంలో సినిమా సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టారైనా వదిలిపెట్టేది లేదని సీపీ వార్నింగ్ ఇచ్చారు. లక్కీ డ్రా స్కీమ్ లకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు డయల్ 100 లేదా వాట్సాప్ నెంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇలాంటి ప్రలోభాలకు బోల్తా పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ తెలిపారు.

Read More... Sajjanar: నాగరిక సమాజంలో ఉన్నామా? లేక రాతి యుగంలో ఉన్నామా?.. సజ్జనార్ ఎమోషనల్ ట్వీట్

Next Story