Sajjanar: ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే! సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2026-01-02 04:44:25  IST  )

బలవన్మరణం ఘటనల వార్తలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ ఎక్స్ వేదికగా స్పందించారు.

Sajjanar: ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే! సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పిల్లల్ని పోషించలేనని మనోవేదనతో పిల్లలతో సహా విషపూరిత ఆహారం తల్లి, కుమార్తె మృతి చెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలో కన్న తండ్రి ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి.. తానూ బలవన్మరణం పొందారు. ఈ ఘటనలపై హైదరాబాద్ సీపీ సజ్జానార్ ఇవాళ (శుక్రవారం) ఎక్స్ వేదికగా స్పందించారు.

తల్లిదండ్రులే.. ఇలా మారితే..

నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి.. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయని, గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారని పేర్కొన్నారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసి ప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? అని ప్రశ్నించారు. నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? అని ఆవేదన చెందారు. కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం.. అని తెలిపారు.

బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు!

చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? అని సజ్జనార్ ప్రశ్నించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడిన వారికి తీరని ద్రోహం.. అని తెలిపారు. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Read More..

రాజధానిలో పోలీసు వ్యవస్థకు కొత్త సరిహద్దులు! కొత్తగా 22 స్టేషన్‌లు

Next Story