- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిలో పోలీసు వ్యవస్థకు కొత్త సరిహద్దులు! కొత్తగా 22 స్టేషన్‌లు
గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసు కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఠాణాల సరిహద్దులు ఖరారయ్యాయి.

దిశ, సిటీ క్రైం : గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసు కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఠాణాల సరిహద్దులు ఖరారయ్యాయి. ఈ సరిహద్దులతో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లలో మొత్తం 146 పోలీస్ స్టేషన్ల పరిధి నెలకొంది. ఇందులో గతంలో ఉన్న ట్రై పోలీస్ కమిషనరేట్ నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లు అటు, ఇటు మారగా, మరికొన్ని కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీలో కలిశాయి. హైదరాబాద్ నుంచి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లోకి మొత్తం 8 పీఎస్ లు వచ్చి చేరాయి. సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల నుంచి 9 పీఎస్ లు కలువగా.. కొత్తగా బడంగ్ పేట్ పీఎస్ ఏర్పాటైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోకి సంగారెడ్డి జిల్లా నుంచి నాలుగు పీఎస్ లు కలిశాయి. మొత్తంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి మార్కెట్ పోలీస్ స్టేషన్ కనుమరుగు అవగా.. బడంగ్ పేట్ పోలీస్ స్టేషన్ కొత్తగా రూపుదిద్దుకుంది. ఈ పోలీస్ కమిషనరేట్లలోని కొన్ని జోన్లు , ఏసీపీ డివిజన్ లకు కొత్త పేర్లు వచ్చాయి. మరికొన్ని ఠాణాల పరిధులు మారి.. ఒకటి, రెండు పోలీసు స్టేషన్లు మాయమయ్యాయి. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ లో మొత్తం నాలుగు డీసీపీ జోన్లు, ఆరు ఏసీపీ జోన్ లలో మొత్తం 22 ఠాణాలు ఉన్నాయి.
డీసీపీ జోన్ – ఏసీపీ డివిజన్ – పోలీస్ స్టేషన్‌లు ఇవే..
1) రంగారెడ్డి జిల్లా / గ్రామీణ ప్రాంతాలు
🔹 డీసీపీ మహేశ్వరం జోన్
ఏసీపీ ఇబ్రహీంపట్నం డివిజన్
ఇబ్రహీంపట్నం
మంచాల
యాచారం
ఏసీపీ మహేశ్వరం డివిజన్
కడ్తాల్
కందుకూరు
మహేశ్వరం
ఫార్మా సిటీ
🔹 డీసీపీ మొయినాబాద్ జోన్
ఏసీపీ చేవెళ్ల డివిజన్
చేవెళ్ల
మోకిల
శంకర్ పల్లి
ఏసీపీ మొయినాబాద్ డివిజన్
మొయినాబాద్
షాబాద్
శంషాబాద్ / పెద్ద షాపూర్
🔹 డీసీపీ షాద్ నగర్ జోన్
ఏసీపీ అమన్ గల్లు డివిజన్
అమన్ గల్లు
కేశంపేట్
మాడ్గుల్
తలకొండపల్లి
ఏసీపీ షాద్ నగర్ డివిజన్
చౌదరిగూడెం
కొందుర్గ్
కొత్తూర్
నందిగామ
షాద్ నగర్
2) మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్
మొత్తం: 4 జోన్లు | 10 ఏసీపీ డివిజన్ లు | 30 పోలీస్ స్టేషన్ లు (కొత్తగా ఉప్పల్, బేగంపేట్ డీసీపీ జోన్లు)
🔹 బేగంపేట్ జోన్
ఏసీపీ బేగంపేట్ డివిజన్
అల్వాల్
బేగంపేట్
బోయిన్ పల్లి
ఏసీపీ గోపాలపురం డివిజన్
గోపాలపురం
మారేడుపల్లి
తుకారంగేట్
ఏసీపీ తిరుమలగిరి డివిజన్
కార్ఖానా
తిరుమలగిరి
బొల్లారం
🔹 ఎల్బీనగర్ జోన్
ఏసీపీ ఎల్బీనగర్ డివిజన్
చైతన్యపురి
ఎల్బీనగర్
సరూర్ నగర్
ఏసీపీ వనస్థలిపురం డివిజన్
అబ్దుల్లాపూర్ మెట్
హాయత్ నగర్
మీర్ పేట్
వనస్థలిపురం
🔹 మల్కాజిగిరి జోన్
ఏసీపీ కీసర డివిజన్
కీసర
షామీర్ పేట్
ఏసీపీ కుషాయిగూడ డివిజన్
చర్లపల్లి
జవహార్ నగర్
కుషాయిగూడ
ఏసీపీ మల్కాజిగిరి డివిజన్
మల్కాజిగిరి
మౌలాలీ
నేరేడ్ మెట్
🔹 ఉప్పల్ జోన్
ఏసీపీ మేడిపల్లి డివిజన్
ఘట్ కేసర్
మేడిపల్లి
పోచారం
ఏసీపీ ఉప్పల్ డివిజన్
నాచారం
నాగోలు
ఉప్పల్
3) సైబరాబాద్ పోలీసు కమిషనరేట్
మొత్తం: 3 డీసీపీ జోన్లు | 7 ఏసీపీ డివిజన్ లు | 22 పోలీస్ స్టేషన్ లు
🔹 శేరిలింగంపల్లి జోన్
ఏసీపీ ఆర్.సి.పురం డివిజన్
చందానగర్
ఆర్.సి.పురం
పటాన్ చెరు
అమీన్ పూర్
ఏసీపీ నార్సింగి డివిజన్
నార్సింగి
గచ్చిబౌలీ
కొల్లూర్
🔹 కూకట్ పల్లి జోన్
ఏసీపీ కేపీహెచ్బీ డివిజన్
కేపీహెచ్బీ
మియాపూర్
ఏసీపీ బాలానగర్ డివిజన్
బాలానగర్
కూకట్ పల్లి
అల్లాపూర్
ఏసీపీ మాదాపూర్ డివిజన్
మాదాపూర్
రాయదుర్గం
🔹 కుత్బుల్లాపూర్ జోన్
ఏసీపీ మేడ్చల్ డివిజన్
మేడ్చల్
దుండిగల్
పేట్ బషీరాబాద్
జీనోమ్ వ్యాలీ
ఏసీపీ కుత్బుల్లాపూర్ డివిజన్
జీడిమెట్ల
జగద్గీర్ గుట్ట
సూరారం
బాచుపల్లి
4) హైదరాబాద్ పోలీసు కమిషనరేట్
మొత్తం: 7 జోన్లు | 26 ఏసీపీ డివిజన్ లు | 73 పోలీస్ స్టేషన్ లు
🔹 చార్మినార్ జోన్
మలక్ పేట్
మీర్ చౌక్
చార్మినార్
హుస్సేని ఆలం
మొఘల్ పురా
శాలిబండ
🔹 సైదాబాద్ జోన్
మలక్ పేట్
చాదర్ ఘాట్
డబీర్ పురా
భవానీనగర్
రెయిన్ బజార్
మాదన్నపేట్
సైదాబాద్
సంతోష్ నగర్
ఐఎస్ సదన్
ఛత్రినాక
🔹 గోల్కొండ జోన్
గోషామహల్
కుల్సుంపురా
అసిఫ్ నగర్
మెహిదిపట్నం
టోలిచౌకి
హబీబ్ నగర్
మాసబ్ ట్యాంక్
బేగంబజార్
అఫ్జల్ గంజ్
మంగళహాట్
గుడిమల్కాపూర్
టప్పాచబుత్ర
లంగర్ హౌజ్
🔹 ఖైరతాబాద్ – 1 జోన్
బంజారాహిల్స్
జూబ్లీహిల్స్
మధురానగర్
ఎస్సార్ నగర్
ఫిలింనగర్
బోరబండ
సనత్ నగర్
🔹 ఖైరతాబాద్ – 2 జోన్
నాంపల్లి
అబిడ్స్
ఖైరతాబాద్
సుల్తాన్ బజార్
పంజాగుట్ట
లేక్ పీఎస్
సైఫాబాద్
నారాయణగూడ
🔹 రాజేంద్రనగర్ జోన్
చంద్రాయణగుట్ట
ఫలక్ నుమా
బండ్లగూడ
కంచన్ బాగ్
కామాటిపుర
బహదూర్ పురా
కాలా పత్తర్
మైలార్ దేవ్ పల్లి
అత్తాపూర్
రాజేంద్రనగర్
🔹 సికింద్రాబాద్ జోన్
చిక్కడపల్లి
ముషీరాబాద్
కాచిగూడ
గాంధీనగర్
మహంకాళి
లాలాగూడ
చిలకలగూడ
వారాసిగూడ
ఉస్మానియా యూనివర్సిటీ
దోమలగూడ
రాంగోపాల్ పేట్
అంబర్ పేట్
నల్లకుంట
🔹 శంషాబాద్ జోన్
ఆదిబట్ల
ఆర్జీఐఏ
బడంగ్పేట్
బాలాపూర్
పహాడీషరీఫ్
గమనిక: పునర్వ్యవస్థీకరణ అనంతరం డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.






