ప్రభుత్వ శాఖల వస్త్రాల ఆర్డర్‌లపై శైలజ రామయ్యర్ కీలక ఆదేశాలు

by Bhoopathi Nagaiah |

ఈ ఏడాది టెస్కో కు అన్ని ప్రభుత్వ శాఖలు వారం రోజులలో తమకు కావలసిన వస్త్ర ఆర్డర్లు ఇవ్వాలని చేనేత జౌళి శాఖ సెక్రటరీ శైలజ రామయ్యర్​ అధికారులకు సూచించారు.

ప్రభుత్వ శాఖల వస్త్రాల ఆర్డర్‌లపై శైలజ రామయ్యర్ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది టెస్కో కు అన్ని ప్రభుత్వ శాఖలు వారం రోజులలో తమకు కావలసిన వస్త్ర ఆర్డర్లు ఇవ్వాలని చేనేత జౌళి శాఖ సెక్రటరీ శైలజ రామయ్యర్​ అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ శాఖలు టెస్కో కు బకాయి పడిన నిధులను వెంటనే చెల్లించాలని కోరారు. 2026- 27 సంవత్సరానికి కేవలం నాలుగు శాఖల నుండి మాత్రమే ఆర్డర్లు వచ్చాయని, మిగిలిన శాఖల నుంచి వారం రోజులలో ఆర్డర్లు అందించాలని ఆదేశించారు. వస్త్రాల ఇండెంట్‌తో పాటు 50 శాతం నిధులను అడ్వాన్సుగా చెల్లిస్తే టెస్కో వస్త్ర ఉత్త్పత్తి ప్రారంభించి సకాలంలో సరఫరా చేస్తుందని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ శాఖలకు సకాలంలో వస్త్రములను ఉత్పత్తి చేసి అందించాలని టెస్కో అధికారులకు సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థల నుండి వస్త్ర కొనుగోలుకు 100 శాతం ఆర్డర్స్ తీసుకుని చేనేత, పవర్ లూమ్ సంఘాలకు వర్క్ ఆర్డర్ ఇచ్చి నేత కార్మికులకు నిరంతరం పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

Next Story