- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సద్గురు జగ్గీ వాసుదేవ్
సీఎం రేవంత్ రెడ్డిCM Revanth Reddyని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru) మర్యాదపూర్వకంగా(Meeting) కలిశారు.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిCM Revanth Reddyని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhguru) మర్యాదపూర్వకంగా(Meeting) కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని సద్గురు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శాలువతో సద్గురున సత్కరించి జ్ఞాపినకు బహుకరించారు. వారిద్ధరు దాదాపు 30 నిమిషాలు సమావేశం అయ్యారు. వారి మధ్య చర్చల వివరాలు తెలియాల్సి ఉంది. తమ ఫౌండేషన్ చేపట్టనున్న కార్యక్రమాలకు రేవంత్ రెడ్డిని సద్గురు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.
భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం ఇషా ఫౌండేషన్ (సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇషా ఫౌండేషన్) కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కి వివిధ సోషల్ మీడియా సైట్‌లలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ముడుపుల వ్యవహారంలో పార్లమెంటు ఉభయసభలలో విపక్షాల ఆందోళనపై సద్గురు ఎక్స్ వేదికగా స్పందించి అందరిని ఆశ్చర్యపరిచారు.
దేశంలోని సంపద సృష్టికర్తలు, ఉద్యోగవకాశాలను కల్పించేవారికి రాజకీయాలను ఆపాదించరాదని సద్గురు పేర్కొన్నారు. భారతీయ వ్యాపార అభివృద్ధి చెందడం ముఖ్యమని అన్నారు. దీనిపై పార్లమెంట్‌లో జరగుతున్న పరిణామాలతో తాను తీవ్ర నిరుత్సాహానికి గురయ్యానన్నారు. ‘ప్రపంచ ప్రజాస్వామ్యానికి దీపస్తంభంలా ఉండాలని ఆకాంక్షించే భారత పార్లమెంటులో ఆందోళనలు నిరుత్సాహానికి గురిచేస్తోందని... దేశంలోని సంపద సృష్టికర్తలు, ఉద్యోగ ప్రదాతలు రాజకీయ విమర్శలకు గురికాకూడదని... ఏమైనా వైరుద్యం ఉంటే అది చట్ట పరిధిలోకి వెళ్తుంది.. కానీ రాజకీయ ఆటగా మారకూడదని వ్యాఖ్యానించారు. భారతీయ వ్యాపారాలు అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమైందని.. భారత్ భవ్య భారత్‌గా మారాలంటే అది ఒక్కటే మార్గం’’ అని సద్గురు చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
అంతకుముందు సద్గురు తన కుమార్తెకు వివాహం చేసి.. జీవితంలో స్థిరపడేలా చేసి..ఇతర మహిళలను మాత్రం సన్యాసినులుగా జీవించాలని ప్రోత్సహిస్తున్నారని దాఖలైన కేసు ఆయన వైఖరిని వివాదస్పదం చేసింది.






