- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సద్దుల బతుకమ్మ సంబరాలు.. గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి జూపల్లి
తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటేలా ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబురాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటేలా ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబురాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే అధికారులు ఈ ఉత్సవాలు కోసం ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ మేరకు సద్దుల బతుకమ్మ సంబురాలను హాజరు కావాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) రాజ్‌భవన్‌న్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma)ను ఆహ్వానించారు. ఆయన వెంట తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి (Valluru Kranthi) కూడా ఉన్నారు. ఈ మేరకు ఇవాళ రాత్రి ట్యాంక్ బండ్‌పై గ్రాండ్ ప్లోరల్ పరేడ్, హుస్సేన్ సాగర్‌లో తేలియాడే బతుకమ్మలు, సచివాలయంపై 3డీ మ్యాప్ లేజర్ షోను నిర్వహించనున్నారు. అమర జ్యోతి స్థూపం నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో కార్నీవాల్ నిర్వహించనున్నారు.






