తెలంగాణ AICC కో-ఇన్‌‌చార్జిగా సచిన్ సావంత్

by Gantepaka Srikanth |

పలు రాష్ట్రాలకు కాంగ్రెస్(Congress) హైకమాండ్ కో-ఇన్‌చార్జులను నియమించింది.

తెలంగాణ AICC కో-ఇన్‌‌చార్జిగా సచిన్ సావంత్
X

దిశ, వెబ్‌డెస్క్: పలు రాష్ట్రాలకు కాంగ్రెస్(Congress) హైకమాండ్ కో-ఇన్‌చార్జులను నియమించింది. ఈ మేరకు మంగళవారం కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ కో-ఇన్‌‌చార్జిగా సచిన్ సావంత్(Sachin Sawant) నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్‌కు సహాయకుడిగా సచిన్ పనిచేయనున్నారు. ఒడిశా కో-ఇన్‌చార్జిగా జెట్టి కుసుమ్ కుమార్, మధ్యప్రదేశ్ కో-ఇన్‌చార్జిగా ఉషానాయుడులను ఏఐసీసీ నియమించింది. దీంతోపాటు హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బిహార్, పంజాబ్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాలకు కూడా కాంగ్రెస్కు కొత్త కో-ఇన్చార్జులను నియమించింది.

Next Story