- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేవలం బిల్డింగులు కడితే సరిపోతుందా?: సబితాఇంద్రారెడ్డి
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై సీఎం రేవంత్‌రెడ్డివి మాటలే తప్ప చేతలు లేవని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై సీఎం రేవంత్‌రెడ్డివి మాటలే తప్ప చేతలు లేవని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసలు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై ప్రభుత్వానికే స్పష్టత లేదన్నారు. కేవలం బిల్డింగ్‌లు కడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. స్కూళ్ల అంచనా వ్యయాన్ని సైతం రూ.80 కోట్ల నుంచి రూ.200 కోట్లకు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. అంతేకాకుండా వేరే రాష్ట్రం ఏజెన్సీకి వాటిని అప్పజెప్పే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో 6,052 మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థల్లో ఐఐటీ, ఎంబీబీఎస్, ఐఐఎంలలో ర్యాంకులు సాధించారని.. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అసలు గురుకులాలకు ఏమీ చేయలేదని అంటున్నారని అన్నారు. ఎన్నో కొత్త గురుకుల కళాశాలలు కేసీఆర్ హయాంలో ఏర్పాటయ్యాయని అన్నారు.
ప్రత్యేక శ్రద్ధతో గురుకులాలు నడపడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని.. ఇందులో రేవంత్ గొప్ప ఏమీ లేదని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను తమ పార్టీ ఏనాడూ వ్యతిరేకించలేదన్నారు. ఇప్పుడు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను ఏం చేస్తారని నిలదీశారు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలను రేవంత్ మూసేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విద్యా కమిషన్ వేసి ఏడాది అవుతున్నా ఏం ఘనత సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకే రేవంత్ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నారని అన్నారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లను విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్సీ సురభివాణి దేవి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అని అన్నారు. విద్యా వ్యవస్థపై సమీక్షలు లేవని పేర్కొన్నారు.






