- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sabitha Indra Reddy: తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఆడబిడ్డలపై దాడులా?
పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కేసీఆర్(KCR) అమలు చేసి చూపించారని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్(BRS) పాలనలో కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కేసీఆర్(KCR) అమలు చేసి చూపించారని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. సోమవారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశా వర్కర్ల(Asha Workers)పై ఈరోజు జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆశావర్కర్ల పట్ల అమానవీయంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఒకవైపు అసెంబ్లీలో తెలంగాణ తల్లి(Telangana Thalli) గురించి మాట్లాడుతూ.. మరోవైపు బయట ఆడబిడ్డలైన ఆశావర్కర్ల మీద దాడి చేయడం దారుణమని అన్నారు.
అసలు రాష్ట్రాన్ని కాంగ్రెస్(Congress) నేతలు ఏం చేయదలుచుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నేతలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) మాట్లాడుతూ.. పోలీసులు ఆశావర్కర్లపై రాక్షస మూకలా వ్యవహరించారని సీరియస్ అయ్యారు. ఏసీపీ శంకర్ మహిళలపై దాడి చేశాడని అన్నారు. మహిళల చీరలను పోలీసులు ఇష్టమొచ్చినట్లు లాగారని తెలిపారు. తెలంగాణ తల్లి గురించి చెబుతూ ఆడబిడ్డలకు న్యాయం చేయరా? అని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రతీ పోలీస్ స్టేషన్ ఆందోళన కారులతో నిండి పోయిందని అన్నారు.






