- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వామినాథన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి.. రైతు జాగృతి యాత్ర చైర్మన్ జగజిత్ సింగ్
ఈ నెల 7వ తేదీన కన్యాకుమారి మొదలైన యాత్ర తమిళనాడు, పాండిచేరి, కేరళ, కర్ణాటక, ఏపీ నుంచి తెలంగాణకు చేరుకుంది. 20 మంది సభ్యులు ఈ యాత్ర లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా రైతు కమిషన్ తో సమావేశమైనట్లు రైతు నాయకుడు జగజిత్ చెప్పారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా రైతులు పండించే పంటకు మద్దతు ధర, చట్టభద్రత కల్పించాలని కోరుతూ జాతీయ రైతు సంఘాల నేతలతో కలిసి రైతు జాగృతి యాత్ర చేపట్టినట్లు యాత్ర చైర్మన్ జగజిత్ సింగ్ డల్లేవాలా తెలిపారు. శనివారం రైతు కమిషన్ కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీన కన్యాకుమారి మొదలైన యాత్ర తమిళనాడు, పాండిచేరి, కేరళ, కర్ణాటక, ఏపీ నుంచి తెలంగాణకు చేరుకుంది. 20 మంది సభ్యులు ఈ యాత్ర లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా రైతు కమిషన్ తో సమావేశమైనట్లు చెప్పారు. యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారికు ఉంటుందని మార్చి 19 వ తేదీ ఢిల్లీ రాంలీల మైదానంలో పెద్ద ఎత్తున రైతులతో సభ నిర్వహిస్తామన్నారు. యాత్ర ద్వారా రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తామని, తెలంగాణలో ప్రభుత్వం రైతు కమిషన్ ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం చాలా మంచి ఆలోచనగా ఉందన్నారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ అని, స్వామినాథన్ కమిటీ కూడా గతంలో ఇదే చెప్పిందని, కానీ పాలకులు మద్దతు ధర రైతులకు సక్రమంగా ఇవ్వడం లేదని దీంతో లక్షల మంది రైతులు చనిపోయారని ఆరోపించారు.
మన ప్రభుత్వం ఉంది మన రైతుల కోసం.. ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. రైతుల నుండి పంట కొనుగోలు చేయకుండా బయట దేశాల నుంచి కొంటామని అంటున్నారు.. దేశంలో రైతులు ఏమైపోతారరని మన పంట మనం కొనకపోతే ఎలా ఉంటుందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చిందని ఖరీప్ సీజన్లో ఎంతో మంది రైతులు జైలు పాలు అయ్యారు. కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, దీనిపై కేంద్ర పాలకులు స్పందించడం లేదని మండిపడ్డారు. రైతు నాయకులు దేశ వ్యాప్తంగా పర్యటిసున్నారని, వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు కమిషన్ సభ్యులతో పాటు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, రైతు నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.






