- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rythu Bharosa Celebrations: రైతు భరోసా విజయోత్సవాలు.. సచివాలయం వద్ద సభకు ప్లాన్
వానాకాలం సీజన్‌కు సంబంధించి తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: వానాకాలం సీజన్‌కు సంబంధించి తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు తెలంగాణ సచివాలయం వద్ద రైతు భరోసా విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. సభ ఏర్పాటు నేపథ్యంలో సోమవారం సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao), అధికారులు పరిశీలించారు.
15 ఎకరాల వరకు జమ : తుమ్మల
నిన్నటి వరకు 9 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. తాజాగా 15 ఎకరాల లోపు ఉన్న వారికి జమ చేయనున్నట్టు ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన విడుదల చేశారు. నేడు మరో 513.83 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.8,284.66 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రకటించారు. మిగిలిన రైతుల ఖాతాల్లో కూడా ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా సాగు భూమికి రైతు భరోసా సాయం అందజేస్తామని మంత్రి ఇటీవల ప్రకటనలో తెలిపారు.






