Rythu Bharosa: రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక ఎకరాకు పంట సాయం రూ.15 వేలు!

by Shiva |
Rythu Bharosa: రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఇక ఎకరాకు పంట సాయం రూ.15 వేలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఈ మేరకు గతంలో పంట పెట్టుబడి సాయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చనుంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట పెట్టుబడి సాయం కింది ఏడాదికి రూ.15వేలు అందజేసేందుకు కసరత్తును మొదలు పెట్టింది. కానీ, పథకం అమలులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేపట్టబోతోంది. ఇందులో భాగంగా కేవలం పంట సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పడావు పడిన భూములు, వెంచర్లు, ఓపెన్ ల్యాండ్‌లకు పెట్టుబడి సాయాన్ని కట్ చేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లుగా సమాచారం. రైతు భరోసా అమలుకు సంబంధించి వెంటనే విధివిధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సాగు భూముల విస్తీర్ణాన్ని జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఇక ఐదు ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలా లేక ఎక్కువ సాగు భూమి ఉన్నా.. వారికి పథకం వర్తిస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది.

Advertisement

Next Story

Most Viewed