ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల

by Prasad Jukanti |   (  Updated:2026-06-18 09:47:39  IST  )

వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రైతాంగానికి కేబినెట్ శుభవార్త చెప్పింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ అనధికార సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు నాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా పథకం నిధుల కోసం చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం రైతు భరోసా పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది.

తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగుతున్న ఈ అనధికారిక కేబినెట్ సమావేశంలో రైతుభరోసా నిధుల అంశంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై సీఎం, మంత్రులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో ఫేజ్‌-2కు అనుమతుల సాధనలో కేంద్రంపై ఒత్తిడి తేవటం, రాష్ట్రంలో సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకునేలా ఒత్తిడి తేవటంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story