- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డితో రష్యా కాన్సుల్ జనరల్ భేటీ.. సమావేశంలో పాల్గొన్న పాస్‌పోర్టు అధికారిని
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రష్యా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో రష్యా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. చెన్నైలోని (Russian Consul General) రష్యా కాన్సుల్ జనరల్ వలెరీ ఖుజ్కవ్ (Valerii Khodzhaev) సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జొన్నలగడ్డ స్నేహజ (Passport Officer Jonnalagadda Snehaja)తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రష్యా కాన్సుల్ జనరల్‌కు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం కీలక అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. వికారాబాద్ జిల్లా రంగాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స, తక్షణ సహాయక చర్యలను అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఇవాళ ఒక ప్రకటనలో సానుభూతి తెలియజేశారు. కాగా, వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారిలో నలుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.






