- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారా మెడికల్ సర్టిఫికెట్స్ ఇప్పించాలి.. టీపీసీసీ చీఫ్‌ను కలిసిన గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు
సూర్యాపేట జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ని కలిసి తమ సమస్యలను వివరిస్తూ మెమోరాండం సమర్పించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సూర్యాపేట జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ని కలిసి తమ సమస్యలను వివరిస్తూ మెమోరాండం సమర్పించారు. మంగళవారం టీపీసీసీ చీఫ్‌ను గాంధీభవన్ లో కలిసిన సంఘం నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవో నెంబర్ 1274 ప్రకారం గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారని, 104,108 అంబులెన్స్ లో ప్రాక్టికల్స్ పూర్తి చేయించి, శిక్షణ పూర్తయిన వారికి పరీక్షలు నిర్వహించి, కమ్యూనిటీ పారా మెడికల్ సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పారని తెలియజేశారు. కాని వారి అకాల మరణంతో ట్రైనింగ్ ఆగిపోయిందని తెలిపారు.
గ్రామీణ వైద్యులకు పరీక్షలు నిర్వహించి కమ్యూనిటీ పారా మెడికల్ సర్టిఫికెట్స్ ఇప్పించాలని మహేశ్ కుమార్ గౌడ్‌కు వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ సీఎం దృష్టికి అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జ్ఞాన సుందర్, గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు జెరిపోతుల లక్ష్మణ్ గౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.






