Ponnam Prabhakar : కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజూ ట్రైన్ నడపండి : కేంద్రమంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ

by Muthe.Rajitha |

కరీంనగర్​ నుంచి తిరుపతి(Karimnagar to Tirupati)కి ప్రతిరోజూ రైలు(Train) నడిపేలా చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్​ ఓ లేఖను రాశారు.

Ponnam Prabhakar : కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజూ ట్రైన్ నడపండి : కేంద్రమంత్రికి పొన్నం ప్రభాకర్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్​ నుంచి తిరుపతి(Karimnagar to Tirupati)కి ప్రతిరోజూ రైలు(Train) నడిపేలా చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్​ ఓ లేఖను రాశారు. అందులో తిరుపతిలోని తిరుమల(Tirumala) కొండపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉత్తర తెలంగాణ(North Telangana) నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజూ తిరుపతికి రైలు నడపాలని ఆ లేఖలో కోరారు. ప్రస్తుతం కరీంనగర్‌ నుంచి గురువారం, ఆదివారం మాత్రమే తిరుపతికి రైలు వెళ్తోందని, అదే ట్రైన్​తిరుపతి నుంచి కరీంనగర్‌కు బుధ, శనివారాల్లో తిరిగి బయలుదేరుతుందని తెలిపారు.

యూపీఏ ప్రభుత్వ హాయాంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు ఈ రైలును ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్లడానికి వీలుగా, సులభతరంగా ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చామని.. అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రస్తుతం తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రతిరోజూ నడిచేలా చర్యలు చేపట్టాలని కేంద్రం ప్రభుత్వాన్ని గత 10 ఏళ్లుగా కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని నిత్యం కరీంనగర్‌ నుంచి తిరుపతికి రైలును నడిచేలా చర్యలు తీసుకోండి అని లేఖలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Next Story