నల్లగొండలో అధికార పార్టీ జోరు.. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం

by Kema Shiva Kumar |

నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 13న వెలువడిన ఫలితాల ప్రకారం, మొత్తం 12 వార్డులకు గానూ కాంగ్రెస్ ఏకంగా 11 వార్డులను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై తన పట్టును నిరూపించుకుంది.

నల్లగొండలో అధికార పార్టీ జోరు.. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ తన జోరును కొనసాగిస్తోంది. నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగి, ప్రతిపక్షాలను చిత్తు చేసింది. మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 12 వార్డులు ఉండగా.. ఏకంగా 11 వార్డులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఇక బీఆర్ఎస్ (BRS) పార్టీ ఒకే ఇక్క స్థానానికి పరిమితమైంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు.

వరుసగా వార్డులను గెలుచుకుంటూ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మున్సిపాలిటీపై తన పట్టును నిరూపించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం ఒక స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి కంచుకోటగా భావించే నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోకి నందికొండ మున్సిపాలిటీ వస్తుంది. గత కొంతకాలంగా ఇక్కడ రాజకీయం హోరాహోరీగా సాగుతున్నా తాజా ఫలితాలు జానారెడ్డి కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి మరోసారి బలమైన పట్టు ఉందని నిరూపితమైంది. అయితే, ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నందికొండ వీధుల్లో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Next Story