కార్మికులపై వేధింపులు ఆపాలి

by Gantepaka Srikanth |

కార్మికులపై వేధింపులు ఆపాలి

కార్మికులపై వేధింపులు ఆపాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సిటీ రీజియన్‌లో ఇన్ ఫ్రా పేరుతో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే నిలిపివేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సీబీఎస్ వద్ద ఉన్న కాచిగూడ డిపో చేంజ్ అవర్ పాయింట్ వద్ద ఇన్ ఫ్రా పేరుతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. కార్మికుల ఇబ్బందులను తెలుసుకునేందుకు శుక్రవారం సీబీఎస్ వద్ద యూనియన్ నాయకులతో కలిసి ఆయన కార్మికులతో మాట్లాడారు. డ్యూటీ దిగిన తర్వాత కండక్టర్లతో ఎస్ఆర్ చూసి క్యాష్ తీసుకునేందుకు ఇన్ ఫ్రా పేరిట తీవ్ర జాప్యం చేస్తూ కార్మికుల పనిగంటలు భారీగా పెరిగేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పుడు అధునాతన టిమ్ (టికెట్ ఇష్యూయింగ్ మెషీన్) వ్యవస్థ నడుస్తున్నా... కావాలని కార్మికులను వేధిస్తున్నారని అన్నారు. 127, 222 రూట్ లో రాత్రి 8 గంటలకు రావాల్సిన బస్సులు డిపోకు 4 గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి 12 గంటలకు వస్తున్నాయని... తర్వాత ఎస్ ఆర్ ఎంట్రీ కోసం మరో గంట ఆలస్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇచ్చిన రన్నింగ్ టైం సరిపోక ట్రాఫిక్ జామ్ లో సిగ్నల్స్ మధ్యన డ్యూటీ చేయడమే కష్టంగా మారిందని... డ్యూటీ చేసి డిపోకు గంటలకు గంటలు ఆలస్యంగా వస్తే... ఇన్ ఫ్రా పేరుతో కార్మికులపై అదనపు పనిభారం మోపడాన్ని, వేధించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టిమ్ లో ప్రోగ్రామింగ్ మార్చి కార్మికులపై అదనపు పని గంటల భారాన్ని త్గగించాలని డిమాండ్ చేశారు.

Next Story