- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ సమ్మె సక్సెస్.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ యూనియన్ అభినందనలు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె సక్సెస్ నేపథ్యంలో కార్మికులకు ఏపీ పీటిడి (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ అభినందనలు తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: సమ్మె బాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమైన సంగతి తెలిసిందే. కార్మికులు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మూడు రోజుల సమ్మె అనంతరం ఇవాళ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు ఏపీ ఏపీ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధినందనలు పోరాటంతో హక్కులు సాధించిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు హృదయపూర్వక అభినందనలు. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో వారి న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ పీటిడి (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ తరఫున కృతజ్ఞతలు అంటూ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ విజయవాడని ఏపీ పీటిడి (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య ఈ ప్రకటన విడుదల చేశారు.
శుభపరిణామం:
గత ప్రభుత్వం 2019 లో తెలంగాణలో ఆర్టీసీ యూనియన్లను రద్దు చేయడం అనేది దురదృష్టకరమైన చర్యగా పేర్కొంటూ, ప్రస్తుత సమ్మె నేపథ్యంలో యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకరించడం ఒక శుభ పరిణామమని వారు అభిప్రాయపడ్డారు. అలాగే పెండింగ్ వేతన సవరణల పరిష్కారం దిశగా అడుగులు పడటం, అలాగే ఇతర సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గం, ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం ఉద్యోగుల భవిష్యత్తుకు మేలు చేసే నిర్ణయమని పేర్కొన్నారు. విలీన ప్రక్రియలో ఉద్యోగుల హక్కులు దెబ్బతినకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం వారు చేపట్టే ప్రతి పోరాటానికి ఏపీ పీటిడి (ఆర్టీసీ) ఎంప్లాయిస్ యూనియన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.






