- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం సంచలన నిర్ణయం: ఇకపై పూర్తి ప్రభుత్వ పరిధిలోకి మెట్రో
హైదరాబాద్ మహా నగర వాసుల ప్రధాన రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైల్‌పై తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగర వాసుల ప్రధాన రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైల్‌పై తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (PPP) పద్ధతిలో నడుస్తున్న ఈ ప్రాజెక్టులో L&T మెట్రోకు ఉన్న 100% ఈక్విటీని ప్రభుత్వం తన వశం చేసుకుంది. దీంతో మెట్రో రైల్ పూర్తిస్థాయిలో ప్రభుత్వ యాజమాన్యం కిందికి వచ్చింది. మెట్రో నిర్వహణ, యాజమాన్య బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో భవిష్యత్తు ప్రణాళికలు, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను ఈ కొత్త బోర్డు పర్యవేక్షించనుంది.
మెట్రో చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణ రావు..
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నూతన చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సీఎస్ రామకృష్ణ రావును ప్రభుత్వం నియమించింది. మెట్రోను మరింత లాభసాటిగా మార్చడం, రెండో దశ విస్తరణ పనులను వేగవంతం చేయడంపై కొత్త చైర్మన్ దృష్టి సారించనున్నారు. మెట్రో నిర్వహణలో L&T సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, రాయితీలకు సంబంధించిన వివాదాలకు ఈ నిర్ణయంతో తెరపడనుంది. ఈక్విటీ బదిలీ ద్వారా మెట్రోపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లభించడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






