RTC Strike : ఆర్టీసీ సమ్మె సైరన్... హైదరాబాద్ లో భారీ ర్యాలీ

by Muthe.Rajitha |

ఈనెల 7 నుంచి ఆర్టీసీ జేఏసీ సమ్మె(RTC JAC Strike)కు దిగనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

RTC Strike : ఆర్టీసీ సమ్మె సైరన్... హైదరాబాద్ లో భారీ ర్యాలీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 7 నుంచి ఆర్టీసీ జేఏసీ సమ్మె(RTC JAC Strike)కు దిగనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లో భారీ ఎత్తున కార్మికులతో ర్యాలీ(Massive Rally) నిర్వహించింది జేఏసీ. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి, సంస్థకు ఎన్నోసార్లు వినతి పత్రం సమర్పించామని.. తప్పనిసరై సమ్మె చేయాల్సి వస్తోందని జేఏసీ ఛైర్మన్ వెంకన్న(RTC JAC Chairman Venakanna) ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమ్మె తేదీ దగ్గర పడుతున్నప్పటికీ సంస్థ నుంచి ఎలాంటి చర్చల పిలుపు రాలేదని, సమ్మెకు సన్నద్ధమైనట్లు ప్రకటించడం కోసమే ఈ భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. అయితే ఆర్టీసీ జేఏసీ ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా నిర్వహించిన ఈ ర్యాలీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవనెత్తకుండా పోలీసులు భారీగా మోహరించడమే కాకుండా.. బస్ భవన్ వద్ద భద్రతను పెంచారు. అయితే ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన విధంగా సమ్మెకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండగా.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Next Story