- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ సమ్మె వేళ జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఆర్టీసీ సమ్మె వేళ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏదైనా ముక్కుసూటిగా చెప్పే తత్వం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట ఉండకూడదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా, అది రాష్ట్రమైనా కేంద్రంలో అయిన.. అపోజిషన్‍లో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట ఎవరు మాట్లాడినా తప్పేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం, డిమాండ్ చేయడం ప్రతిపక్షం నుండి తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని విస్మరించకూడదని ఇది ఏ పార్టీ చేసినా తప్పేనన్నారు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎవరిని ఉద్దేశించి..
జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి. ఇంతకు జగ్గారెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించే అనే చర్చ జరుగుతోంది. నిజానికి జగ్గారెడ్డి ఉద్దేశం, టార్గెట్ ఎవరో తెలియనప్పటికీ ఆర్టీసీ సమ్మె సమయంలో ఈ మాట చెప్ప దమ్ము జగ్గారెడ్డికి మాత్రమే సొంతం నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






