- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండగా నిలిచిన ఆర్టీసీ..ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ ఆర్టీసీ అండగా నిలిచింది.

ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఆర్టీసీ
ఉచిత ప్రమాద బీమా ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం
దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ ఆర్టీసీ అండగా నిలిచింది. ప్రమాదవశాత్తు మృతిచెందిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించింది. పికెట్, పరిగి డిపోలకు చెందిన డ్రైవర్లు సుధాకర్, శ్రీనివాసరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఆపద సమయంలో యూనియన్ బ్యాంక్ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు అక్కరకొచ్చింది. ఈ ఇద్దరికి ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి విలువైన చెక్కులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఏం.రవీంద్రబాబు, రీజనల్ హెడ్ డి.వెంకటేశ్వర్లుతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి బస్ భవన్‌లో అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో పికెట్, పరిగి డిపోలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు మరణించడం విచారకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.






