- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీలో వేధింపులు ఎక్కువయ్యాయ్: ఎన్నికలు కావాల్సిందే
ఆర్టీసీలో వేధింపులు ఎక్కువయ్యాయ్: ఎన్నికలు కావాల్సిందే

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ హయాంలో 2019లో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించకుండా వాటిని రద్దు చేశారని.. అయితే కచ్చితంగా వాటిని తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ (ఎస్.డబ్ల్యుయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రాజిరెడ్డి తెలిపారు. ఈ మేరకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరుతూ శుక్రవారం జాయింట్ లేబర్ కమిషనర్ సునీత గోపాల్ దాస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీలో యూనియన్లను అనుమతించ పోవడం వల్ల వేతన సవరణ అమలుపై ప్రశ్నించే పరిస్థితే లేకుండా పోయిందన్నారు. వేతన సవరణ జరగక కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 56,700 మంది ఉన్న కార్మికులు... ఇప్పుడు 40 వేల లోపునకు తగ్గిపోయారని... కానీ పనిభారం మాత్రం భారీగా పెరిగిందన్నారు. రోజుకు 14 గంటల నుండి 16 గంటల వరకు డ్యూటీలు చేయిస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ చొరవ తీసుకుని ఆర్టీసీలో యూనియన్లకు అనుమతించే విధంగా, హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించేలా ఆదేశాలు ఇప్పించాలని రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.






