కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్

by Naga Rani Yarlagadda |

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును రద్దు చేయాలని, విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి..

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల అమలును రద్దు చేయాలని, విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకు అవకాశం కల్పించాలనే తదితర డిమాండ్లు పరిష్కారం కోసం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటియు) ఆధ్వర్యంలో వివిధ డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై డిమాండ్స్ డే ను పాటించారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ పాలసీ "శ్రమ శక్తి నీతి - 2025" ని రద్దు చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలు ఎత్తి వేసి గుర్తింపు ఎన్నికలు, సీసీఎస్ కు ఎన్నికలు జరపాలని కోరారు. రిటైర్ అయిన కార్మికులకు రావలిసిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని, 2021, 2025 వేతన సవరణ ఒప్పందాలను చేయాలని, 2017 అలవెన్సులు సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలను ప్రభుత్వాలు మానుకునాలన్నారు. ఆర్టీసీని కాపాడుకునే పోరాటంలో ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు పాల్గొనాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

Next Story