- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్టీసీ స్మార్ట్ కార్డులు
మహిళలకు స్మార్ట్ కార్డుల విషయంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. లగ్జరీ బస్సుల్లో డిస్కౌంట్ ఇవ్వబోతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని (Free Bus Scheme Women) పొందేందుకు మహిళలకు స్మార్ట్ కార్డు (Smart Card) జారీ చేసేందుకు ఆర్టీసీ (Telangana RTC) కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. తాజాగా ఓ మీడియా చానల్‍తో మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రానికి చెందిన మహిళలు తెలంగాణ అడ్రస్‌తో ఫేక్ ఆధార్ కార్డులను తయారు చేసుకుని ఈ పథకం కింద ప్రయాణిస్తున్నారని, దీన్ని చెక్ పెట్టేందుకు త్వరలోనే స్మార్డ్ కార్డులను తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డుల నమూనాగా మూడు డిజైన్లు సిద్ధం చేశామని, వీటిలో నుంచి ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుందని చెప్పారు. స్మార్ట్ కార్డులు వచ్చాక టికెట్ జారీ చేయడం కూడా మరింత సులభం అవుతుందన్నారు.
మార్చి నుంచి ఏసీ, ఈవీ బస్సుల్లో డిస్కౌంట్..
వేసవి సెలవుల దృష్ట్యా వచ్చే మార్చి 1 నుంచి ఏసీ, మిగతా లగ్జరీ బస్సుల్లో డిస్కాంట్ ఇవ్వబోతున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. వీటిల్లోని టికెట్ ధరలు ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలతో సమానంగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. పొలుష్యన్ నియంత్రించే భాగంగా ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రికల్ బస్సులే నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పీఎంఈ డ్రైవ్ కింద త్వరలో రాష్ట్రానికికి 2,000 బస్సులు రాష్ట్రానికి రాబోతున్నాయన్నారు.






