- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ ఆన్ లైన్ సర్వే.. ఐటీ ఉద్యోగులకు సజ్జనార్ కీలక విజ్ఞప్తి
by Prasad Jukanti |
టీజీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ సర్వే చేపట్టింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టీసీని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో సంస్థలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ఐటీ కారిడార్ పై ఫోకస్ పెట్టారు. ఐటీ కారిడార్ లో మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ఆర్టీసీ ఓ సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఈ సర్వే లింకులు సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేశారు. ఈ లింక్ ను ఉపయోగించుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు ఐటీ కారిడార్ కు రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను ఆర్టీసీకి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణ సమాచారంతో పాటు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సర్వేలో వచ్చిన సమాచారాన్ని బట్టి ఐటీ కారిడార్ లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story






