- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటుకున్న కండక్టర్.. అభినందించిన సజ్జన్నార్
ఎవరివైనా డబ్బులు లేదా బంగారం దొరికందంటే వెంటనే జేబులో పెట్టుకుని అది తమదే అని ఫిక్స్ అయిపోతారు. కానీ కొంతమంది మానవత్వంతో తిరిగి ఇచ్చేస్తారు.

దిశ, వెబ్ డెస్క్: ఎవరివైనా డబ్బులు లేదా బంగారం దొరికందంటే వెంటనే జేబులో పెట్టుకుని అది తమదే అని ఫిక్స్ అయిపోతారు. కానీ కొంతమంది మానవత్వంతో తిరిగి ఇచ్చేస్తారు. అలానే తనకు దొరికిన విలువైన ప్రయాణికులకు తిరిగి ఇచ్చి అచ్చంపేట కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 26న హైదరాబాద్ అచ్చంపేట ఆర్టీసీ బస్సులో రూ.13 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలతో పాటూ కొంత నగదును ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయాడు.
మానవత్వం చాటుకున్న కండక్టర్.. అభినందించిన సజ్జన్నార్అది కండక్టర్ వెంకటేశ్వర్లుకు దొరకడంతోవాటిని నిజాయితీగా బాధితుడికి తిరిగి ఇచ్చేసి మానవత్వం చాటుకున్నాడు. దీంతో ఆ కండక్టర్ ను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ బస్ భవన్‌లో సన్మానించి అభినందించారు. తన వస్తువులు తిరిగి ఇవ్వడంతో ప్రయాణికుడు సైతం కండక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సజ్జన్నార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరవాత సంస్థ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసరమైనప్పుడు ఉద్యోగులను సైతం ఇలా అభినందించి ప్రోత్సహిస్తున్నారు.






