- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన RTC మజ్దూర్ యూనియన్
పోలింగ్‌కు రెండు రోజుల ముందు తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో : పోలింగ్‌కు రెండు రోజుల ముందు తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ యూనియన్‌తో అనుబంధంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు మాత్రమే కాక వారి కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఏ పార్టీకి మద్దతు పలకాలనే విషయమై యూనియన్‌లో చర్చ జరిగిన తర్వాత స్వచ్ఛందంగానే కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించాలనే నిర్ణయం జరిగినట్లు వివరించారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్‌కు మీడియా సమక్షంలో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఇచ్చిన హామీతో సంతృప్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచచారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల భద్రతకు సంబంధించి యూనియన్ల ఇష్టం మేరకు, వారితో సంప్రదింపుల అనంతరం నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వచ్చిన హామీతో ఇప్పుడు ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.






