- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీరో టికెట్ల జారీలో మార్గదర్శకాలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ జేఏసీ వినతి
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకువచ్చి మహిళలకు జీరో టికెట్ తో ఆర్టీసీలో కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం కండక్టర్ల ప్రాణాల మీదకు తెస్తోందని ఆర్టీసీ జేఏసీ వాపోయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకువచ్చి మహిళలకు జీరో టికెట్ తో ఆర్టీసీలో కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం కండక్టర్ల ప్రాణాల మీదకు తెస్తోందని ఆర్టీసీ జేఏసీ వాపోయింది. ఆర్టీసీలో రెండేళ్లుగా అమలు చేస్తున్న జీరో టికెట్ల జారీలో రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో పొరపాటున మహిళలకు ఇవ్వాల్సిన జీరో టికెట్ అనుకోకుండా పురుషులకు వస్తోందని... తనిఖీల సమయంలో ఏమాత్రం మానవత్వం చూపించకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. కఠినమైన శిక్షలు వేసి కార్మికులపై కనికరం లేకుండ ఉద్యోగాల నుండి తొలగించడంతో తీవ్ర మనోవేదనకు గురైన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొంటూ బుధవారం ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ద్వారా కోరారు.
ఈ మేరకు ఆర్టీసీ ఈడీకి వినతిపత్రం అందించి తమ సమస్యను ఎండీ దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కేసులో ఉద్యోగం కోల్పోయిన నర్సంపేట డిపో కండక్టర్ బి.రాజ్ కుమార్ బ్రైన్ స్టోక్ తో ఈ నెల20న చనిపోయారని తెలిపారు. ఇంకా ఎంతో మంది కార్మికులు చేయని తప్పులకు ఉద్యోగాలు కోల్పోతూ బలవుతున్నారని, మరికొందరు ఆర్ధిక ఇబ్బందు లతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. జీరో టికెట్ వలన అనుకోకుండా జరిగే పొరపాటులకు కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించకుండా సంబందిత అధికారులకు ఆర్టీసీ ఎండీ తగిన ఆదేశాలు, మార్గదర్శకాలు ఇచ్చి కార్మికులకు భరోసా కలిపించాలని కోరారు, ఎండీ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటామని ఈడీ మునిశేఖర్ హామీ ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి ఉన్నారు.






