ఆసిఫాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి : ఆర్టీసీ జేఏసీ డిమాండ్

by Muthe.Rajitha |

ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ పై అక్రమ కేసు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అరెస్టు చేసి రిమాండుకు పంపిన రెబ్బన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.

ఆసిఫాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి : ఆర్టీసీ జేఏసీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ పై అక్రమ కేసు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అరెస్టు చేసి రిమాండుకు పంపిన రెబ్బన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 23న ఆసిఫాబాద్ డిపోనకు చెందిన లహరి బస్సు డ్రైవర్ రామరావు హైదరాబాద్ నుండి అసిఫాబాద్ వెళ్తున్న క్రమంలో రెబ్బన పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును ఎడమ వైపు రోడ్డు ప్రక్కన పూర్తి సైడ్ లో ఇండికెటర్ లైట్స్ వేసి ఆపాడని... కొద్ది సేపటికి అదే మార్గంలో బొలెరో వేగంగా వచ్చి బస్సుకు వెనుక ఎడమ భాగంలో ఢీకొనిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.

ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ తీవ్ర గాయలతో చికిత్స పొందుతూ హాస్పిటల్ లో మృతి చెందాడని ఈ ఘటన జరిగిన వెంటనే రెబ్బన పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ తప్పు లేకపోయినా నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అరెస్టు చేసి రిమాండుకు పంపారని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ రోడ్డుకు దూరంగా బస్సును పార్క్ చేసినా అన్యాయంగా అరెస్టు చేసి 5 రోజులుగా జైళ్లో ఉంచారని ఆరోపించారు. ఆర్టీసీ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి తెలిపారు.

ఆర్టీసీ యాజమాన్యం ఈ సంఘటన పట్ల తక్షణమే సీరియస్ గా స్పందించి పోలీస్ ఉన్నతధికార్లతో మాట్లాడి డ్రైవర్ పై నమోదు చేసిన అక్రమ కేసును ఉపాసంహరింపచేసి డ్రైవర్ ను రిమాండ్ నుంచి విడుదల చేయించాలని కోరారు. ఈ వ్యవహారంలో ఆసిఫాబాద్ డిపో మేనేజర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని జేఏసీ నేతలు ఆరోపించారు.

Next Story