భవిష్యత్‌లో సమ్మె తప్పదు.. RTC JAC మరో ప్రకటన

by Gantepaka Srikanth |

తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) సిబ్బంది తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. మంగళవారం ఆర్టీసీ సిబ్బంది(RTC Staff)తో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

భవిష్యత్‌లో సమ్మె తప్పదు.. RTC JAC మరో ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC) సిబ్బంది తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. మంగళవారం ఆర్టీసీ సిబ్బంది(RTC Staff)తో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మంత్రితో చర్చల అనంతరం ఆర్టీసీ జేఏసీ(RTC JAC) నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భవిష్యత్‌లో తప్పకుండా సమ్మె చేసి తీరుతామని ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలతో ఆడుకోకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తామేం కొత్త కోరికలు కోరడం లేదని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన హామీనే అడుగుతున్నామని అన్నారు.

ఇదిలా ఉండగా.. ఆర్టీసీ యాజమాన్యం(RTC Management) సైతం నిన్న ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ పరిస్థితులను వివరించడంతోపాటు.. ఉద్యోగుల సంక్షేమం విషయంలో యాజమాన్యం ఏ మాత్రం రాజీపడబోదని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో బెదిరింపులకు దిగడం సరికాదని పేర్కొంది. ఏదైనా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించింది. మీరు సమర్థంగా విధులు నిర్వర్తించడం వల్లే ఇవాళ ఆర్టీసీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అది గుర్తించిన ప్రభుత్వం కూడా ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు ఇస్తోంది. దయచేసి సమ్మె ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆర్టీసీ జేఏసీ తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేసింది.

Next Story