హైదరాబాద్ నగర వాసులకు ఆర్టీసీ తీపి కబురు

by Prasad Jukanti |   (  Updated:2025-12-10 11:59:44  IST  )

హైదరాబాద్ కనెక్ట్ పేరుతొ ఆర్టీసీ సరికొత్త కార్యాచరణను ప్రకటించింది

హైదరాబాద్ నగర వాసులకు ఆర్టీసీ తీపి కబురు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‍లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీల వాసులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తీపి కబురు చెప్పింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్టీసీ సేవలు అందించేలా ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో సరికొత్త కార్యాచరణను ప్రకటించింది. 373 కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు బుధవారం ఆర్టీసీ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ డిసెంబర్ నెల నుంచే ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయని స్పష్టం చేసింది. ఇటీవల సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. నగర శివారుల్లోని 30 సర్కిళ్లు, 150 వార్డుల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల రవాణా అవసరాలను గుర్తించారని తెలిపింది.

ముఖ్యంగా ఉద్యోగులు, సాప్ట్ వేర్ ఎంప్లాయిస్ సౌకర్యార్థం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఉప్పల్, తదితర ఎంప్లాయిమెంట్ హబ్స్ కాలనీల నుంచి నేరుగా బస్సులను నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కనెక్ట్ కార్యక్రమాన్ని మూడు దశల్లో సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. మొత్తం 373 కాలనీలకు గాను హైదరాబాద్ రీజియన్ లోని 243, సికింద్రాబాద్ రీజియన్‍లో 130 కాలనీలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

Next Story