BIG BREAKING: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

by Ramesh Naini |   (  Updated:2026-04-23 17:04:23  IST  )

శంకర్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. దారి మధ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది.

BIG BREAKING: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ గురువారం ఉదయం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో శంకర్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. దారి మధ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. దాదాపు 80 శాతం కాలిన గాయాలు ఉండటంతో శంకర్ గౌడ్ మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం అతని మృతదేహం కంచన్ బాగ్ DRDOలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె.. శంకర్ గౌడ్ మృతితో మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేపు కార్మిక సంఘాలతో ఐదుగురు మంత్రుల కమిటీ చర్చిస్తుందని ప్రభుత్వం ప్రకటించినా.. అందుకు కార్మికులు సిద్ధంగా ఉంటారా ? మరేదైనా కార్యాచరణ ప్రకటిస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది.

Next Story