- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OG2 లోడింగ్.. అఫీషియల్ అకౌంట్ నుంచి అదిరిపోయే అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగ చేసుకునే అప్డేట్ ఒకటి వచ్చేసింది.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండుగ చేసుకునే అప్డేట్ ఒకటి వచ్చేసింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిజల్ట్ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యాక్టింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశారని, ఇక రాజకీయాలపైనే పూర్తి పోకస్ పెట్టబోతున్నారని గత కొద్ది రోజులుగా నెట్టింట వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వైరల్ న్యూస్‌కు చెక్ పెడుతూ ‘పవర్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ‘మాట ఇచ్చినట్లే ఆయన చేస్తారు.. సమయం ఎప్పుడనేది ఆయన మనకు తెలియజేస్తారు.. సుజీత్ విదేశాల నుండి తిరిగి వచ్చాక మనం చర్చిద్దాం.. OG2’ అంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, ముప్పాళ రంగ రామన్ నిర్మించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ 2025లో విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది.






