వెంకటేశ్వర అలివేలు మంగమ్మ స్వాములవారి కళ్యాణ మహోత్సవానికి పాల్గొన్నపీసీసీ సభ్యులు

by Kodari Anjali |

శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర అలివేలు మంగమ్మ స్వాములవారి కళ్యాణ మహోత్సవానికి పీసీసీ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్ పాల్గొన్నారు.

వెంకటేశ్వర అలివేలు మంగమ్మ స్వాములవారి కళ్యాణ మహోత్సవానికి పాల్గొన్నపీసీసీ సభ్యులు
X

దిశ, చందంపేట: చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర అలివేలు మంగమ్మ స్వాములవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాలే నరసింహారెడ్డి మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గ ప్రజలపై స్వాములవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వాములవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిత్రియాల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story