- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరాల నుంచి కాపాడనున్న RTC బస్ టికెట్
కేవైసీ పేరిట జరిగే సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు ఆర్టీసీ, ఆర్బీఐ సంయుక్తంగా ముందుకు వచ్చాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కేవైసీ పేరిట జరిగే సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు ఆర్టీసీ, ఆర్బీఐ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ప్రయాణికులను గమ్యానికి చేర్చే ఆర్టీసీ బస్సు టికెట్ ఇకపై సైబర్ నేరాల నుంచి కూడా కాపాడనుంది. రాష్ట్రంలో రోజుకు 60 లక్షల మంది తీసుకునే ఈ చిన్న టికెట్ ముక్కనే.. సైబర్ నేరగాళ్లకు కళ్లెం వేయనుంది. కేవైసీ పేరిట జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీతో ఆర్బీఐ చేతులు కలిపింది. ఈ మేరకు బస్ భవన్‌లో సోమవారం ఈకేవైసీ అవగాహన పోస్టర్‌ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్బీఐ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకు అకౌంట్లున్న ప్రతి ఒక్కరూ తమ కెవైసీ అప్ డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమని నాగిరెడ్డి పేర్కొన్నారు. అప్డేట్ చేసుకోవడం ఎంతో అవససరమని, లావాదేవీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయనే విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు మరవకూడదని సూచించారు. అదే సమయంలో కేవైసీ పేరిట చేసే మోసాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. కేవైసీ మోసాలపై ఆర్బీఐ అప్రమత్తం చేస్తూ కేవైసీ-ఫైనాన్సియల్ లిటరసీ వీక్ థీమ్ సందేశాలను బస్సు టికెట్ల వెనకవైపున ముద్రించడం, బస్సుల వెనకాల అతికించడం ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 13వరకు ఆర్బీఐ లిటరసీ వీక్...
ఆన్లైన్, ఏటీఎం, బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్, బ్యాంకు శాఖ ద్వారా కెవైసీ అప్డేట్ చేసుకోవచ్చని ఆర్బీఐ జనరల్ మేనేజర్ ముత్యాల జ్ఞాన సుప్రభాత్ పేర్కొన్నారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు సమర్పించవచ్చని తెలిపారు. ఆర్బీఐ, హైదరాబాద్ ఫిబ్రవరి నేటి నుంచి 13వ తేదీ వరకు కేవైసీ-ఫైనాన్సియల్ లిటరసీ వీక్ నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కేవైసీ, సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీ (సీకేవైసీ) గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఖాతాల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం, కేవైసీ మోసాలు, మనీ మ్యూల్ కార్యకలాపాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆర్టీఐ లక్ష్యమని వెల్లడించారు. వారం రోజుల పాటు బస్సు టికెట్ల వెనకాల కేవైసీ-ఫైనాన్సియల్ లిటరసీ వీక్ థీమ్ సందేశాలను ముద్రించడం ద్వారా ప్రయాణికులకు ఈ సందేశం చేరుతుందన్నారు. సుమారు 120 ఆర్టీసీ బస్సుల వెనుక భాగంలో అతికించే కేవైసీ-ఫైనాన్సియల్ లిటరసీ వీక్ థీమ్ వల్ల పోస్టర్ల ద్వారా కేవైసీ మోసాలపై ప్రజలకు అవగాహన కలుగుతుందన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు యశ్వంత్ సాయి చిట్టెంశెట్టి, రాములు సభావత్ తదితరులు పాల్గొన్నారు.






